JMS News Today

For Complete News

పోస్టల్ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, డిసెంబర్ 15: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ భవన్ లో బుధవారం సాయంత్రం పోస్టల్ ఉద్యోగులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. పేదలకు ఉచితంగా న్యాయ సాయం అందించడానికి ఏర్పాటైన ఈ సేవా సంస్థ గురించి పోస్టల్ ఉద్యోగుల ద్వారా గ్రామాల్లో ఉండే ప్రజలకు తెలియజేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం కల్ఫించాలని కోరారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం కూడా ఈ సేవా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సూజీ సంస్థ ముఖ్య ఉద్ధేశం గురించి కూలంకషంగా వివరించారు. ఈ సదస్సులో మెయిల్ ఓవర్ సీర్ మల్లేశం,
కరీంనగర్ నార్త్ సబ్ డివిజన్ బ్రాంచ్ పోస్టు మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *