మరింత సౌకర్యం కోసం….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే. కామ్)
కరీంనగర్, మార్చి 7: క్యాష్ కౌంటర్ల వద్ద స్వైప్ మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చి పాలసీదారులకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సీనియర్ డివిజనల్ మేనేజర్ విఎంవి.రామశాస్త్రి తెలిపారు. శనివారం స్థానిక ఎల్ఐసి బ్రాంచి వన్ కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామశాస్త్రి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీదారులకు సేవలందించడంలో ఎల్ఐసి ప్రత్యేకతను సాధిస్తోందన్నారు. డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లోనే స్వైపింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.. పాలసీదారుల స్పందనకు అనుగుణంగా అన్ని బ్రాంచి కార్యాలయాల్లోనూ ఈ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. బ్రాంచి మేనేజర్ సంపత్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలసీలను రూపొందించడంలో ఎల్ఐసి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. తమ సంస్థ ప్రవేశపెడుతున్న పాలసీలకు ప్రజలనుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఎల్ఐసి వల్ల చేకూరుతోన్న ప్రయోజనాలను గుర్తిస్తున్న అనేక మంది పాలసీదారులవుతున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించిన తమ బ్రాంచి డివిజన్ స్థాయిలో ముందంజలో ఉందన్నారు..ఈ కార్యక్రమంలో ఎఫ్ అండ్ ఎ మేనేజర్ భాస్కర్ రావు, బ్రాంచి ఎబిఎం రమేష్, ఐసిఇయు బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీనివాస్, గజ్జెల నరేందర్, ఉపాధ్యక్షులు బి.సంతోష్ లతో పాటు బ్రాంచి అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు, పాలసీదారులు పాల్గొన్నారు…