రేప్ కేసు నిందితుడికి జీవిత ఖైదు..!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 11: అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ, కోర్టు తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన కేసులో రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మచ్చ అజయ్ (20) కి జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ గురువారం కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి తీర్పునిచ్చారు.