JMS News Today

For Complete News

మరో సంగ్రామానికి మోగిన నగారా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగియగానే, మరో ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూలు విడుదల చేసింది. నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. డిసెంబర్ 10 పోలింగ్,
డిసెంబర్ 14 కౌంటింగ్ జరగనుంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కొ స్థానానికి, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో మరో సంగ్రామానికి నగారా మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *