మరో ప్రేమ జంట అఘాయిత్యం…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 25: ప్రేమ జంటలు క్షణికావేశానికి లోనవుతూ…బలవన్మరణాలకు పాల్పడుతున్నాయి. ఫలితంగా ఇరు కుటుంబాలు తీరని విషాదానికి గురవుతున్నాయి. ఎదిగిన పిల్లలు కళ్ళ ముందే కాటికి వెళుతుంటే, వారు గుండె పగిలేలా రోదిస్తున్నారు. మూడు రోజుల క్రితం రామాపురంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య మరిచిపోక ముందే, తాజాగా, హైదరాబాద్ లో మరో ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, అందులో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నల్లగొండ జిల్లా రంగారెడ్డి గూడకు చెందిన సందీప్ రెడ్డి, త్రివేణి లు ప్రేమించుకుంటున్నారు. అయితే, ఏమైందో ఏమో కానీ…దిల్ సుఖ్ నగర్ లో సందీప్ గదిలో ఇద్దరు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని సేవించారు. సందీప్ చనిపోగా, త్రివేణి పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాము చనిపోతే పక్క పక్కనే సమాధులు కట్టాలని సూసైడ్ నోట్ లో పేర్కొనడం కలచివేసింది. రాష్ట్రంలో ఓ వైపు ఆభం శభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతుండగా, మరోవైపు ప్రేమ జంటలు బలవన్మరణాలకు పాల్పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది.