సీఏ లు మోసం చేస్తున్నారు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 16: సీఏ లు మోసం చేస్తున్నారంటూ మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. మహిళ సంఘ సభ్యులను గ్రామ సీఎలు మోసం చేస్తున్నారని, వారిని తొలగించాలని కోరుతూ జగిత్యాల మండలం పొలాస మహిళలు జగిత్యాల- ధర్మపురి రహదారిపై గల పొలాస రోడ్డు వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. బ్యాంకు రుణాలు ఇప్పించే క్రమంలో ఒక్కొక్కరి వద్ద నుంచి రెండు వేల చొప్పున వసూళ్లు చేస్తున్నారని, పొదుపు ఖాతా లెక్కలు కూడా సరిగా చూపటం లేదని ఆరోపించారు. సీఎలను తొలగించి, వారి స్థానంలో మరొకరిని నియమించాలని మహిళలు డిమాండ్ చేశారు. అరగంట కు పైగా నిర్వహించిన ఈ ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ పోలీసులు అక్కడికిి చేరుకొని మహిళలను శాంతింపజేయటంతో ఆందోళన విరమించారు.