డ్యాం కట్టపై ఈ-టికెట్ అమలు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 13: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన భద్రతా చర్యల్లో లేక్ పోలీస్ స్టేషన్ సేవలు మకుటాయామానం నిలుస్తున్నాయి. ప్రతినిత్యం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించుటకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్, రన్నింగ్జ, జల క్రీడల కోసం వచ్చే వారికి భద్రత పెంపొందించే చర్యల్లో భాగంగా లేక్ పోలీసులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, మానేరు తీర ప్రాంతాలు సేఫ్ జోన్ గా తయారు చేస్తున్నారు. మరింత పటష్టంగా భద్రత కల్పించాలని లక్ష్యంతో సిపి కమలాసన్ రెడ్డి లేక్ పోలీసులకు ఈ టికెట్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. డ్యాం పైన యువకులు మోటార్ సైకిల్ పై ట్రిపుల్ రైడింగ్, మైనర్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మొదలైన వాటిని అదుపు చేయుటకు ఈ టికెట్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి పటిష్టంగా అమలు చేయుటకు డ్యాంపై తనిఖీలు కూడా ముమ్మరం చేశారు.