సర్పంచ్ లకే ఉండాలట….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 2: ఉప సర్పంచ్ లకు ఇచ్చిన చెక్ పవర్ ను రద్దు చేయాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరుగుతున్న మండల సర్వసభ్య సమావేశం లో ఉప సర్పంచులకు చెక్ పవర్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ సర్పంచ్ లు సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని కూడా అందజేశారు.