JMS News Today

For Complete News

వేగంగా చేయండి…

1 min read

కరీంనగర్: స్మశాన వాటిక పనులను వేగంవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ జి. వేణుగోపాల్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో బాగంగా శనివారంం  కరీంనగర్ లోని 21 వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలని సమీపంలోని మానేరు గ్రేవియార్డును  ఆయన సందర్శించారు. నూతనంగా కొనసాగుతున్న స్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రేవీయార్డు గ్రాఫ్ నమానాను పరిశీలించారు. స్మశానవాటికలో ఏర్పాటు చేస్తున్న నిర్మాణాలను, కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను ఎస్ఈ భద్రయ్య, డీఈ మసూద్ లను అడిగి తెలుసుకున్నారు.  ఈ సంధర్బంగా కమీషనర్ మాట్లాడుతూ…చేసే పనుల్లో నాణ్యతలు పాటించాలన్నారు. నమూన ప్రకారం స్మశానవాటికలో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నగరపాలక సంస్థలో చేపట్టిన వైకుఠధామాల పనులను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భద్రయ్య, డీఈ మసూద్, కార్పోరేటర్ ఆకుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *