అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
చిత్తూరు, జూన్ 27: చిత్తూరు జిల్లా. పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ గ్రామంలో రమ్య (19) అనే వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రేణిగుంట వినాయకనగర్ కు చెందిన రమేష్ -జయలక్ష్మి దంపతుల కుమార్తె రమ్యను పూతల పట్టు రంగంపేట క్రాస్ ఈశ్వర్(23) కు సంవత్సరం క్రితం ఇచ్చి వివాహం చేశారు. రమ్య తల్లిదండ్రులు అయిదు లక్షల కట్నం, ముప్పై స్వరాలు బంగారు అందజేశారు. అయితే, గత కొద్ది రోజులుగా అత్తింటి వారు రమ్యను అధిక కట్నం వేధిస్తుంటే రమ్య తల్లిదండ్రులు గత రాత్రి అత్తవారింటికి వచ్చి మరల పది సవరాలు బంగారు అందజేశారు. అయినా, తన కూతురు మరణ వార్త వినాల్సి వచ్చిందంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. అదనపు కట్నం కోసం ఈశ్వరికి మరో వివాహం చేయాలని కుట్రతో తమ కుమార్తెను హత్య చేశారని పూతల పట్టు పోలీసులత ఫిర్యాదు చేశారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.