రూపాయి కలిసొచ్చిందేమో….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 29: కరీంనగర్ బల్దియాలో అంతా రూపాయి మయమే.రూపాయి కలిసొచ్చిందేమో ఏ పథకానికైన సరే ఒక్క రూపాయి పెడుతున్నారు. నిన్న రూ.1కే అంత్యక్రియలు..నేడు రూ.1కే రక్త, మూత్ర పరీక్ష…రేపు ఏమిటో అన్న అతృత, ఉత్కంఠ ప్రస్తుతం అందరిలో పెరుగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా మేయర్ రవీందర్ సింగ్ పలు వినూత్న పథకాలకు నడుంబింగించారు. ఇప్పటికే ఆఖరి సఫర్ పేరిట రూ.1కే దహన సంస్కారాల నిర్వహిస్తూ… ప్రశంసలు అందుకున్న కరీంనగర్ బల్దియా రూ.1కే రక్త, మూత్ర పరీక్ష పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మేయర్ రవీందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నగర పరిశుభ్రత, మంచి నీటి సరఫరా చేయడమే కాదు నగర ప్రజలకు వైద్యం అందించడం కూడ మున్సిపాలిటీ భాద్యత అని చెప్పారు. నగర ప్రజలకు చేరువయ్యే విధంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో పథకాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల కోసం నగరపాలక సంస్థ లో ఒక మెడికల్ ఆఫీసర్ నియామకం కోసం మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారని, ఆ వైద్య అధికారి ఆధీనంలో నగరపాలక కార్యాలయంలో 1 రూ. కే రక్తం మరియు మూత్రం, బీపి పరిక్షలు చేయిస్తామని వివరిించారు. ఒక పిహెచ్ సీ కేేంద్రం ఏర్పాటు చేసి అందులో లాబ్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరపాలక సంస్థలో చిన్న చిన్న వైద్య పరిక్షలు చేయిస్తామని, ఈ పథకానికి ఇప్పటికే తీర్మాణం చేశామన, త్వరలో పథకాన్ని ప్రవేశ పెడుతామని అన్నారు. అలాాగే పేద ప్రజల కోసం బూట్ హౌస్ నిర్మాణం చేస్తామని, ఈ పాద రక్షక కేంద్రంలో పాత చెప్పులను రీ సైక్లింగ్ చేసి… పేద వారికి పాదరక్షలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఎలాంటి భరోసా లేని వృద్ధులు, అనాథల కోసం నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవేకాక ఆనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో కార్పోరేటర్ లంక రవీందర్, టీఆర్ఎస్ నాయకులు సాదవేణి శ్రీనివాస్, మైఖెల్ శ్రీనివాస్, గుంజపడుగు హారిప్రసాద్, దండబోయిన రాము, తదితరులు పాల్గొన్నారు.