JMS News Today

For Complete News

ఎంసెట్, ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు

1 min read

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఈసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు షెడ్యూల్‌ వివరాలను విడుదల చేశారు. అభ్యర్థులు కోరుకున్న సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావచ్చని తెలిపారు. ఎంసెట్‌ షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన స్లాట్‌ బుకింగ్‌: – జూన్‌ 24 నుంచి జులై 1వరకు

ధ్రువపత్రాల పరిశీలన: – జూన్‌ 27 నుంచి జులై 3 వరకు

వెబ్‌ఆప్షన్ల నమోదు: – జూన్‌ 27 నుంచి జులై 4వరకు

ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు: -జులై 6న

ఆన్‌లైన్‌లో సెల్ప్‌ రిపోర్టింగ్‌: – జులై 6 నుంచి 12 వరకు

ఈ సెట్‌ షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌: – ఈ నెల 22, 23

అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన: – ఈ నెల 24 నుంచి 26 వరకు

వెబ్‌ ఆప్షన్ల నమోదు: – ఈ నెల 24 నుంచి 27 వరకు

ఈసెట్‌ సీట్ల కేటాయింపు: – ఈ నెల 29న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *