మెట్రో స్టేషన్ పెచ్చులు పడి మహిళ మృతి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, సెప్టెంబర్ 22: వర్షం కురుస్తుందని మెట్రో స్టేషన్ కింద నిలుచున్న ఓ మహిళాపై స్టేషన్ పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన ఘటన అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలు కూకట్పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. సాయంత్రం భారీ వర్షం కురుస్తున్నసమయంలో..సారథి స్టూడియోస్ దగ్గర మెట్రో లైన్ కింద తన సోదరితో కలిసి నిలుచున్న మౌనికపై పైనుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తీవ్రగాయాలతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. మంచిర్యాలకు చెందిన మౌనికకు నెలన్నర క్రితమే వివాహమైంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.