సాధ్యమైనంత త్వరగా ఇస్తాం….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 15: తాను హమీ ఇచ్చిన మేరకు చాత్తాద శ్రీవైష్ణవ జిల్లా సంఘానికి సాధ్యమైనంత త్వరగా స్థలం కేటాయిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హమీ ఇచ్చారు. శుక్రవారం మంత్రి కమలాకర్ తన నివాస గృహంలో చాత్తాద శ్రీవైష్ణవ జిల్లా శాఖ రూపొందించిన క్యాలెండర్ -2021ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని కులాలకు రాష్ట్ర రాజధానిలో స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారని, అందులో చాత్తాద శ్రీవైష్ణవ రాష్ట్ర సంఘానికి స్థలం కేటాయించారని గుర్తు చేశారు. జిల్లాలో కూడా సంఘానికి స్థలం ఇస్తామని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మంత్రికి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రెస్ భవన్లో చాత్తాద శ్రీవైష్ణవ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు జగన్నాథం శ్రీనివాస స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా కరోనా మహమ్మారితో మరణించిన చాత్తాద శ్రీవైష్ణవ బంధువుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే సంఘ కార్యాలయం ప్రారంభించాలని, ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా జోనల్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమితులైన తాడూరు కరుణాకర్ ను జిల్లా సంఘం ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జానంపేట మారుతి స్వామి, ప్రధాన కార్యదర్శి ధర్మపురి శేఖర్, కోశాధికారి శ్రీపెరంబూదూర్ చక్రధర స్వామి, ఉపాధ్యక్షులు శ్రీభాష్యం వెంకటరాఘవేంధ్రాచార్యులు, సాత్పడి శ్రీచరణ, కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు సంపత్ కుమార్, కార్యదర్శులు తిరునగరి గోపాల స్వామి, హరిదాసు అండాలు, సంయుక్త కార్యదర్శి చెన్నోజ్వల మనోహర స్వామి, మీడియా ఇంచార్జీ చెన్నోజ్వల శ్రీధర్ స్వామి, మాజీ కార్యదర్శి తిరునగరి రవీందర్, నాయకులు శ్రీభాష్యం కృష్ణస్వామి, రంగనాయకుల శ్రీనివాస్, సాత్పడి యుగందర్, నాగరాజు శ్రీధర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.