30న మంత్రికి ఆత్మీయ సత్కారం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 24: బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులైన గంగుల కమలాకర్ ను ఘనంగా సన్మానించనున్నామని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. ఈ నెల 30న పద్మనాయక కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు బీసీ కులాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకతీతంగా అన్నీ కులాలకు చెందిన బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని… కోరారు. మంగళవారం ఆర్ అండ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల ఐక్యవేదిక, ఆహ్వాన కమిటీ కన్వీనర్ మెతుకు సత్యం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు, జిల్లా ఎల్లాపి సంఘ నాయకులు గణేష్ బాబు లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మెతుకు సత్యం మాట్లాడుతూ కరీంనగర్ కు తొలిసారిగా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ దక్కడం ఆనందంగా ఉందన్నారు. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ ప్రజలకు గంగుల కమలాకర్ సేవలందిస్తూ వస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక శాఖలను కట్టబెట్టడంపై బీసీ సంఘాల కృతజ్ఞతలు తెలుపుతున్నాయన్నారు. వరుసగా మూడు సార్లు కరీంనగర్ అసెంబ్లీ నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించిన గంగుల కమలాకర్ కు బీసీ కులాలన్నీ అండగా ఉంటాయని ఆయన వెల్లడించారు. గంగుల కమలాకర్ కు సన్మానం బీసీలకు సన్మానమేనని స్పష్టం చేశారు. బీసీ ఉద్యమ నేత గంగుల సత్కారానికి స్వచ్చంధంగా తరలిరావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రాజు అన్నారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న గంగుల కమలాకర్ కు పదివి దక్కడం బీసీలకు గర్వకారణమన్నారు. 11 కుల సంఘాలకు 2 కోట్ల 20 లక్షల నిధులతోపాటు పలు కుల సంఘాలను స్థలాలు కేటాయించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే స్థాయిలోనే అనేక సంక్షేమ పథకాలు అందించారని, వెనుకబడిన కులాల మంత్రిగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకతీతంగా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని శ్రీధర్ రాజు కోరారు. ఈ సమావేశంలో జిల్లా స్వర్ణకారుల సంక్షేమ సంఘ నాయకుడు ముత్తోజు శ్రీనివాస్, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు సింగిరాల వెంకటస్వామి, జిల్లా రజక సంఘ నాయకులు గంగిపెల్లి వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘ నాయకులు సిరిశెట్టి రాజేష్, జిల్లా యాదవ సంఘ నాయకులు గాలి రవియాదవ్, బీసీ సంఘ నాయకులు రాచమల్ల రాజు, జిల్లా కురు సంఘ నాయకులు మీస బీరయ్య, జిల్లా గౌడ సంఘ నాయకులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘ నాయకులు కలర్ సత్తన్న, వొల్లాల కృష్ణహరి, వేముల విష్ణు, బీసీ కుల సంఘాల నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.