JMS News Today

For Complete News

జిల్లా మంత్రిగా హామీ ఇస్తున్నా…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 9: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన జర్నలిస్టు కుటుంబానికి రెండు పడకల ఇండ్లు నిర్మించి అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని సేకరించాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని, రానున్న రెండు నెలల్లో ప్రభుత్వ స్థలం గుర్తించి, ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి అందజేస్తామని పేర్కొన్నారు. జిల్లా మంత్రిగా హామీ ఇస్తున్నా…జిల్లా కేంద్రంలోని ప్రతి జర్నలిస్టు కుటుంబానికి డబుల్ బెడ్రూమ్అం దజేస్తామని తెలిపారు. జర్నలిస్ట్ లు ఎలాంటి పాదయాత్రలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టొద్దని మంత్రి గంగుల ఆ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. కాగా, మంత్రి హమీ మేరకు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన, పాదయాత్ర కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామిలు ఒక ప్రకటనలో తెలిపారు.

1 thought on “జిల్లా మంత్రిగా హామీ ఇస్తున్నా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *