JMS News Today

For Complete News

అలా చేసి..రాదనుకుంటే పొరపాటే..

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 26 :ప్రభుత్వం ఇస్తున్న బియ్యం తీసుకుని దయచేసి ఎవరు ఇంటి నుంచి బయటకి రావొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. గురువారం మంత్రి కరీంనగర్ లో ఉచిత రేషన్ బియ్యం పంపిణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మీ కోసమే ఈ కార్యక్రమం చేస్తుందని, బియ్యం తీసుకుంటున్న సమయంలో థంబ్ ఇంప్రెషన్ చేసేప్పుడు ప్రతిసారి సానిటీజర్ ఉపయోగిచాలని చెప్పామని తెలిపారు. బియ్యం తీసుకునే వాళ్ళకి కార్డు కి ఒక టోకెన్ ఇస్తున్నామని చెప్పారు. అందరూ ఒకేసారి రేషన్ షాప్ లకి రావొద్దని అన్నారు. మీకు ఇళ్లకు సరుకులు ఇస్తూ ఇంట్లోనే ఉండమని చెప్తున్నామని, దయచేసి ప్రజలు సహకరించాలని కోరారు. ఉదయం పూట మార్కెట్ లో గుంపులుగా తిరిగి ఆ తరువాత ఇంట్లో కూర్చుంటే వైరస్ రాకుండా ఉంటుంది అనుకుంటే పొరపాటే అని, బయటకు వచ్చిన సందర్భంలో గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవాలని, అప్పుడే కరోనా నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవహారించాలని మంత్రి గంగుల ప్రజలకు మరోమారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *