JMS News Today

For Complete News

వారికీ రిలీప్ ఫండ్ వరం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 2: అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి రిలీప్ ఫండ్ వరంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మంత్రి మీసేవ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 190 మంది లబ్ధిదారులకు 84 లక్షల 76 వేల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని నిరుపేదలను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ అందరివాడిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని, సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులు సిఎం కెసిఆర్ కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఉపసర్పంచ్ సుంకి శాల సంపత్ రావు , కార్పోరేటర్లు చానగొండ బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, బర్కత్ అలీ, కోల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *