కరీంనగర్ ఇక అలా….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 9: కరీంనగర్ లో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ అద్బుత నగరంగా మారుతుందని అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. అర్హత లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నగరం మీద ఉన్న ప్రేమ తో కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందన్నారు. బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత 19నెలలకు హైద్రాబాద్ లో మొదటి సమావేశం జరిగిందని, ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కొత్తగా 5 పనులకు పరిపాలన పరమైన ఆమోదం లభించిందని చెప్పారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేసిన అలుగునూర్ వద్ద అద్భుత ఐలాండ్ నిర్మిస్తామని, మానేరు రివర్ ఫ్రంట్ కు తోడుగా కుడి వైపు నాలుగున్నర కిలోమీటర్ల నిడివిలో మానేరు రివర్ బండ్ అభివృద్ధి చేస్తామని, దాదాపు 100కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని తెలిపారు. మానేరు నుంచి చేగుర్తి వరకు 5చెక్ డ్యాములు నిర్మిస్తామని అన్నారు. మూడు జోన్లలో 24 గంటల పాటు తాగు నీటి సరఫరాకు ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని వివరించారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం చేపడతామని, కరీంనగర్ లో ఈ బస్ నడిపేందుకు డీపీఆర్ రూపకల్పన చేస్తామని తెలిపారు. చారిత్రక కట్టడాల రక్షణకు 3.2కోట్లతో చర్యలు చేపడతామని అన్నారు. సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్ కోసం 66కోట్లతో ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం 5.6కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.
స్మార్ట్ సిటీ పనుల్లో వరంగల్ కంటే కరీంనగర్ ముందంజలో ఉందని తెలిపారు. కరోనా కట్టడిలో నగరపాలక సంస్థ చర్యలు భేష్ అని కేటీఆర్ కొనియాడారని చెప్పారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని,
సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ధ్వారా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడతామని అన్నారు. యుజిడి పనులను పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు , డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్ , వాల రమణారావు, గందె మాధవి, ఆకుల నర్మద , వంగల శ్రీదేవి , బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్ ,దిండిగాల మహేష్ నేతికుంట యాదయ్య , భూమా గౌడ్, పిట్టల శ్రీనివాస్, సల్ల రవీందర్ ,వంగల పవన్ తదితరులు పాల్గొన్నారు.
అయ్యా….. తెలంగాణ ప్రభుత్వమా..
కరీంనగర్ జిల్లాలో నిరుపేద ప్రజలలు…
ఇల్లు లేని నిరుపేద ప్రజలు చాలా మంది ఉన్నారు…
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూములను
కరీంనగర్ జిల్లాలో
ఎంత మంది ప్రజలకు
ఇస్తారో అర్థం కాలేదు
అసలు ప్రభుత్వం
కరీంనగర్ జిల్లా
నిరుపేద ప్రజలకు
డబుల్ బెడ్రూములు
ఇళ్ళు నిర్మిస్తుందా…?….లేదా?
అనేది అర్థం కావడం లేదు.
అయితే తెలంగాణ రాష్ట్రం
ఏర్పాడిన నుంచి ఇప్పటివరకు నిరుపేదల ప్రజలకు
డబుల్ బెడ్రూముల
ఇళ్ళు ఇవ్వలేదు.
ప్రతి ఎలక్షన్ లలో
మా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నిరుపేదలకు
ఇళ్ళు నిర్మిమీంచి ఇస్తామని నమ్మదగిన మాటలను తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
కానీ ఇప్పటివరకు ప్రజలకు న్యాయం జరగలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న
ప్రతి నిరుపేదల ప్రజలకు
డబుల్ బెడ్రూముల
ఇళ్లు నిర్మించి ఇవ్వాలని
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్.పి.ఐ)
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
కుతాడి శివరాజ్
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర..
ప్రజలలు అనేక సమస్యలు
ఎదుర్కొంటున్నారుని
ప్రభుత్వం వెంటనే స్పందించి
ప్రజలకు న్యాయం చేయాలని
కుతాడి శివరాజ్
ఒక ప్రకటనలో కోరారు
ఇట్లు
కుతాడి శివరాజ్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్. పి.ఐ)
తెలంగాణ రాష్ట్రం