JMS News Today

For Complete News

మేరునగ ధీరుడు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 28: తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ బిడ్డ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పీవీ మన ఠీవి భూ సంస్కరణలు.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన మహానేత, మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి మంత్రి కమలాకర్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణ రావు, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, కలెక్టర్ శశాంక, కమిషనర్ క్రాంతి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో పీవీ నరసింహారావు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పి.వి చొరవతో నేను ఇంజనీరింగ్ చేశానని గుర్తు చేశారు. పుట్టింది వరంగల్ లో అయినా కానీ కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర లో తన బాల్యం మొత్తం గడిపారని, ఒకానొక సమయంలో తనపై ఉన్న కేసుల న్యాయ పోరాటం కోసం తన ఆస్తులను కూడా అమ్ముకున్న మహానేేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు దేశ వ్యాప్తంగా ఆయన సేవలు ఎంతో గొప్పవని, ఆయన బహుభాషా కొవిదుడని కోనియాడారు. వారి శతజయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముందుకు రావాలని ఆయన తెలిపారు. మనదేశానికి దిక్సూచిగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ పీవీ నరసింహారావు మచ్చ లేని మనిషి అని అతనికి భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు రచనలు వ్రాసినవి ఎన్నో ముఖ్య విషయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆఫ్ లైన్ ఈయన ప్రస్తావన వ్రాసినారని, కవి సామ్రాట్ సత్యనారాయణ, వేయి పడగలు రచనలు, కాకతీయ పత్రికను ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా గొప్పగా వ్రాసారని పేర్కొన్నారు. కరీంనగర్ నగర వాసులకు గుర్తింపు ఉండే విధంగా గీతాభవన్ ముందు అతని విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ సుజాత, వ్యవసాయాధికారి శ్రీధర్, జడ్పీటిసీలు, ఎంపిటిసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని ఉజ్వల పార్క్ లోని పీవీ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూల మాల వేసి అంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *