ఆయన సమర్దుడే….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ సమర్ధుడేనని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో ఇవాళ మీడియాతో మంత్రి కమలాకర్ మాట్లాడారు. పాలనపరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని, కేటీఆర్ తండ్రికీ తగ్గ తనయుడని అన్నారు. అది మా పార్టీ అంతర్గత వ్యవహారమని మంత్రి గంగుల స్పష్టం చేశారు.