JMS News Today

For Complete News

దానికి రెండువేలే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మే 13: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధృక్పధంతో కాకుండా…మానవతా దృక్పతంతో పని చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించిన ధరలకు అందించడంతో పాటు రేట్ల వివరాలను సూచిక బోర్డులో ప్రదర్శించాలన్నారు.
కరోనా మహమ్మారి పేద, ధనిక భేదం తేడా లేకుండా అందరి ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి నుంచి సిటి స్కాన్ ను కేవలం 2000 రూపాయలకే అందించేందుకు డయాగ్నటిక్ కేంద్రాలు అంగీకరించాయని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి రెమిడీసీవర్ ఇంజేక్షన్లకు కొరత లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమిడీసీవర్ ఎన్ని కొనుగోలు చేశారు, ఎవరికీ ఇచ్చారనే వివరాలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగానే జిల్లాల స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారి అసోసియేషన్ ను హెచ్చరించామన్నారు. కరోనాతో ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకురావాలని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..కరోనా కష్ట కాలంలో మెరుగైన వైద్య సదుపాయం కోసం చాలామంది కోవిడ్ పేషేంట్లు హైదరాబాద్ వెళ్తున్నారని కరోనా రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని అంబులెన్స్ డ్రైవర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే కరోనా పేషెంట్ ల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తే అంబులెన్సులు సీజ్ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు సాధారణ అంబులెన్సు ₹8000 ఆక్సిజన్ తో 10000 వెంటిలేటర్ అయితే 14,000 లు టెక్నీషియన్ కు 3000 లు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా డిటిసిని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *