JMS News Today

For Complete News

ఆందోళన వద్దు..నెలాఖరు వరకు ఇస్తాం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఏప్రిల్ 4: రేషన్‌ షాపుల్లో ఉచిత బియ్యాన్ని నెలాఖరువరకు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరీంనగర్ లో ఓ రేషన్ షాపును శనివారం మంత్రి తనిఖీ చేశారు. పంపిణీ పై డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రూ.1100 కోట్ల వ్యయంతో రెండు కోట్ల 80 లక్షల మందికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సర్వర్ సమస్యతో రేషన్ బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరుగుతోందని అన్నారు. 87 లక్షల తెల్ల రేషన్ కార్డుదారుల్లో ఇప్పటికే 35 శాతం బియ్యం పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ బియ్యం అందేవరకు రేషన్ పంపిణీ కొనసాగిస్తామని, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు అర్బన్ ఏరియాలో వరుసగా మూడుసార్లు బియ్యం తీసుకోని వారి బయోమెట్రిక్ తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బయోమెట్రిక్ అవసరం లేకుండానే బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యంకు, ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. పలు గ్రామాల్లో జనం బయటికి రాకుండా ఉండేందుకు ఇళ్ల వద్దనే స్థానిక ప్రజా ప్రతినిధులు రేషన్ బియ్యం పంపిణీ చేయడం శుభసూచకమని అన్నారు. నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప ఆలోచనకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *