మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగుల
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 3: బీసీల అభ్యున్నతికి కృషిచేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో సీఎం కేసీఆర్ రెండు శాఖలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 72 ఏళ్ళు గడుస్తున్నా అందరికీ ఉన్నత విద్య అందలేదని అన్నారు. నాకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
రెండు శాఖల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవచేసే అవకాశం ఇచ్చారని,
ముఖ్యమంత్రి నా పై పెట్టుకున్న నమ్మక వమ్ము చేయనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారని చెప్పారు. ఖరీఫ్ లో ధాన్యం పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, రైతులకు న్యాయం చెయ్యడమే మా లక్ష్యమని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క బియ్యం గింజ నల్ల బజారుకు తరలకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి బిడ్డ చదువుకోవాలని సీఎం గురుకులాలు తీసుకొచ్చారని చెప్పారు. బిసి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గంగుల కమలాకర్ ని కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.