ఆడంబరాలు వద్దు…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 9: నా వెంట ఉండి నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇంతటి స్థాయిలో నిలిపిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి కమలాకర్ హామీ ఇచ్చారు. పౌర సరఫరాల శాఖలో చేపట్టిన, చేపట్టాల్సిన కార్యక్రమాలను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఆడంబరాలు వద్దని, ఏలాంటి సన్మానాలు చేయడం, బొకేలు తీసుకురావడం, ఫ్లెక్సీలు పెట్టడం లాంటివి చేయవద్దని, వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని కరీంనగర్ నియోజకవర్గ ప్రజలను మంత్రి కోరారు.