పలు మార్కెట్లను పరిశీలించిన మంత్రి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 28: కరీంనగర్ లో 11 మందికి పాజిటివ్ రావడం వలన ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం నగరంలో బస్టాండ్ తో పాటు వ్యవసాయ మార్కెట్ లో కూరగాయల మార్కెట్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొరకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పని సరిగా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలోని అధికారులు, పాలకవర్గ సభ్యులు, మున్సిపాల్ సిబ్బంది కూడా అందరు అప్రమత్తమై ఈ వైరస్ ను ఎట్టి పరిస్థితుల్లోను కట్టడి చేసి తర్వాత దాన్ని పారదోలటానికి అందరు ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు తిరిగిన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి, రోజూ వారి రాకపోకలు ఆపి వేయడం జరిగిందని పేర్కోనారు. దానితో పాటు మిగితా ప్రాంతాలను కూడా ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేయడం జరిగిందని, అందువలన అందరూ ఇంటికే పరిమితం చేయడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లాలో ప్రజలు జాగ్రత్త వహించడం వలన దాని ద్వారా వైరస్ ని కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. కూరగాయల మార్కెట్లో గతంలో 4, 5 మార్కెట్లు ఉండేవని, ఇప్పుడు మున్సిపల్ పాలకవర్గం సభ్యులు 11 కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సులువుగా కూరగాయలు కొనుక్కొవడం జరుగుతుందని, అయినను ఇంకా సరిపోవడం లేదని చాలా మంది వస్తున్నారని, ఇంక 4 కూరగాయల మార్కెట్లు పెంచే అవకాశం ఉందని అన్నారు. అలకపురి కాలనీ, హుస్సేన్ పూర, హౌజింగ్ బోర్డు కాలని ఇంకా 4, 5 కూరగాయల మార్కెట్లను పెంచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు ఒకే చొట గుంపులుగా ఉండే అవకాశం ఉండదని మంత్రి అన్నారు. కొందరు ప్రజలు ఇంటికే నిత్యవసర వస్తువులు ఇవ్వమని కోరారు, దాన్ని కూడా స్పెన్సర్ వారు ఈ రోజు నాతో పాటు, మున్సిపల్ వాళ్లతో చర్చించడం జరిగిందని అన్నారు. ఒక ఫోన్ నెంబర్ తోనే ప్రతి ఇంటికి సరుకులు అందజేసే అవకాశం ఉందని, ప్రజలకు ఏ విధమైన సహాయం కావాలన్నా ప్రభుత్వం వెంటనే సమకూర్చడానికి ముందు ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రపంచం మొత్తం కూడా ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నవని, ప్రభుత్వం ఎంత కష్టపడిన ప్రజలు సహకరించకపోతే చాలా కష్టం అని అన్నారు. ఈ రోజు వరకు కూడా గుంపులు గుంపులుగా రావడం జరుగుతుందని తెలిపారు. కూరగాయల కోసం అందరూ ఒకేసారి రావడం వల్ల కర్ఫ్యూ లో రోజు మొత్తం ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. గుంపులుగా ఉండడం వలన వైరస్ ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కాబట్టి కర్ఫ్యూ లో రోజు మొత్తం ఎలా ఉంటారో అలాగే బయటికి వచ్చినప్పుడు కూడా గుంపులుగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ మెంటెన్ చేయాలని అన్నారు. కాబట్టి ప్రజలు దూరంగా ఉండి సోషల్ డిస్టెన్స మెంటెన్ చేసి కూరగాయలు కొనుక్కొవాలని అన్నారు. ఇంకొక 15 రోజులు కష్ట పడితే మన తెలంగాణ నుంచి ఈ మహమ్మారి వైరస్ ను పారదోలే అవకాశం ఉందని, దయచేసి 15, 20 రోజులు కష్టపడితే మన జీవితం బాగుంటుందని, లేకపోతే అందరు ఇబ్బందిపడాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. కరీంనగర్ ప్రజలారా.. కచ్చితంగా ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసి పారదోలాలని, మన కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ నగర, రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఈ వైరస్ ను పారదోలాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని అన్నారు. ఇంటికే పరిమితం కావాలని , బయటకివచ్చినా గుంపులు గుంపులుగా రావద్దని, గుంపులుగా ఉన్న చోటుకి వెళ్ళవద్దని, సోషల్ డిస్టెన్స్ మెంటెన్ చేయాలని, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు వ్యక్తి గత పరిశుభ్రత , స్వీయ నియంత్రణ ఇవన్ని జాగ్రత్తలు పాటించడం వలన వైరస్ ను కంట్రోలు చేయవచ్చనని మంత్రి పేర్కోన్నారు. ప్రభుత్వం అందించిన అవకాశాలు, సదుపాయాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.