JMS News Today

For Complete News

మంత్రి ఈటెల ఏమన్నారంటే…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 29: టీఆర్ఎస్ పార్టీని అజేయ శక్తిగా నిలిపేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగరంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి,      ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులుగా ఉన్న వాళ్లంతా పార్టీకి మూలమని, పార్టీకి పునాదులు లేకపోతే పదవులు దక్కవని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సభ్యత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే భీమా సౌకర్యం ఉంటుందన్న విషయం తెలియజేయాలన్నారు. 50 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ప్రజల ఆదరణ ఉన్న నాయకుడికి పైరవీలు అవసరం లేదన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా ప్రజా సేవ చేయాలని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు చేయిస్తూ… టీఆర్ఎస్ పార్టీని అజేయ శక్తిగా నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ పార్టీ కోసం  పని చేసే వాడే టీఆర్ఎస్ కుటుంబ సభ్యుడని, ప్రజా సేవ చేసే వాడే పార్టీకి ఆత్మీయుడన్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పై ప్రజల్లో ప్రేమ చెక్కుచెదరలేదన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సృష్టించామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి పొత్తు అవసరం లేదని, మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూతపడే దిశగా ఉందని, ఆ పార్టీతో పోటీయే లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, వీలైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని, విబేదాలు పక్కనబెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీలొద్దీన్, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షత వహించారు. సభ్యత్వ నమోదు మొదటి రశీదును మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ కు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *