మనస్సు ఉన్న మహారాజు ఆ మంత్రి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 20: మరోమారు మనస్సు ఉన్న మహారాజు అనిపించుకున్నారు మంత్రి ఈటెల రాజేందర్. నిరుపేదలైన అన్నాచెల్లెళ్లకు మంత్రి ఈటల అండగా నిలిచారు. సొంత ఖర్చుతో అన్నాచెల్లెళ్లకు వినికిడి యంత్రాలను అందించారు. సిరిసేడు గ్రామానికి చెందిన ఇద్దరు అన్నా చెల్లెలు జోడు పవన్, జోడు పవిత్ర వినికిడి లోపంతో బాధపడుతుండగా, వారికి రాజేందర్ సొంత ఖర్చుతో యంత్రాలను అందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.