సమస్యల సాధనకు మంత్రులకు వినతి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 19: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా మంత్రులకు టీయూడబ్ల్యూజే (ఐజెయు) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేతలు బుధవారం వినతిపత్రాలను అందజేశారు.
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరీ చేయాలని, జర్నలిస్టులకు అందించిన హెల్త్ కార్డులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆరోగ్య శ్రీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 20 నుండి 25 వరకు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలకు వినతిపత్రాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్ లను కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి
జానంపేట మారుతీ స్వామి, కోశాధికారి శరత్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈద మధుకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, విజయభాస్కర్, నాయకులు ఇమామ్, మోసిన్, అసద్, షుకూర్, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మణ్, కోల తిరుపతి లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్ లు తదితరులు పాల్గొన్నారు.