JMS News Today

For Complete News

మంత్రులు ఏమన్నారంటే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

వరంగల్, జూలై 20: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతానికి ఇప్పటికీ తేడా మీరు గమనించి ఉంటారు..తెలంగాణ ఉద్యమంలో మీ సహకారం మరువలేనిది…అంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకోదు…నిలబడదు..ఆనాడు అనేక మంది వాదించారు. కానీ తెలంగాణా దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎక్కడ ఉన్నా తెలంగాణ మా రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చిందని, మానవ సంబంధాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో హరితహారం, మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు. వైద్య రంగంపైన ప్రభుత్వం తనదైన ముద్ర వేస్తుందని మంత్రి రాజేందర్ చెప్పారు. మరో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, మంత్రి ఈటెల అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ని ఒప్పించి ఎంజీఎం లో మౌలిక వసతుల కోసం 10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. డాక్టర్ వృత్తి దేవుడు ఇచ్చిన వరం లాంటిది..సంపాదన కంటే..పేదలకు వైద్యం చేసి వారిని బ్రతికించిన తృప్తి ఎక్కువగా ఉంటుంది…అని పేర్కొన్నారు. ఎంజిమ్ అభివృద్ధి కి కృషి చేశా…ఎన్నారై ఆరోజుల్లో నేను కొరగానే కోటి రూపాయలు లక్కిరెడ్డి అంకిరెడ్డి ఇచ్చారని గుర్తు చేసారు. ఎంజిఎమ్ అభివృద్ధి కి ప్రభుత్వం తోపాటు… ఎన్నారై లు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, నగర మేయర్ గుండా ప్రకాష్, జెడ్పి చైర్మన్ డా.సుదీప్ కుమార్, శాసన సభ్యులు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, డియంఈ రమేష్ రెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.కరుణాకర్ రెడ్డి, కేఎంసి ప్రిన్సిపల్ డా.సంధ్య, ఆలూమిని ప్రెసిడెంట్ డా.సుధాకర్ రెడ్డి, కన్వీనర్ డా.కాలిప్రసాద్, సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *