కరీంనగర్ లో దారుణం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఫిబ్రవరి 27: కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడగా, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అంబేడ్కర్ నగర్ కు చెందిన బాధిత చిన్నారి మూడవ తరగతి చదువుతోంది. ఈ నెల 24న అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఆడుకుందామని నమ్మించి ముగ్గురు వ్యక్తులు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. గురువారం ఉదయం చిన్నారి తలనొప్పి వస్తోందని ఏడ్చింది. ఏం జరిగిందని తల్లి ఆరా తీయగా..చిన్నారి అసలు విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన ఇద్దరు మేజర్లేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది.