ఎమ్మెల్యే సవాల్ కు ఒకే…..
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
బోయినపల్లి, ఆగస్టు 3: మిడ్ మానేరు నిర్వాసితుల విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని , దీనిపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని, చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని ముంపు గ్రామల ఐక్య వేదిక అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ స్పష్టం చేశారు. శనివారం బోయినిపల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ బోలుమాల శంకర్, జిల్లా అంబెడ్కర్ సంఘాల నాయకుడు కత్తెరపాక రవీందర్ తో కలసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రవిశంకర్ మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నిర్వాసిత కుంటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5.04 లక్షలు ఇస్తానని తనతో చెప్పినట్లు ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చింది నీవే కదా అని ప్రశ్నించారు. 2015 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు 2 లక్షలు ఇవ్వాలని స్పష్టంగా జిఓ ఉన్నప్పటికీ కేవలం యువకులకి మాత్రమే ఇచ్చి, యువతలకు మాత్రం మొండిచేయి చూపించారని విమర్శించారు. 2008 సంవత్సరంలో కుటుంబ పరిహారం కోసం గెజిట్ చేయడానికి ముందు మూడు సంవత్సరాలుగా ముంపు గ్రామాల్లో నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లంచాలని జిఓ ఉన్న పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పై అంశాలపై బోయినిపల్లి అంబెడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని, సమయం చెప్పండి, అక్కడే మీరు ఏమి చేసారో ప్రజల ముందే తెలుసుకుందాం రండి అంటూ ప్రతి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేని నాయకులు నిర్వాసితులకు మేమే న్యాయం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేేవా చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్, వంశీ గౌడ్, లచయ్య తదితరులు పాల్గొన్నారు.