JMS News Today

For Complete News

మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 3: వాతావరణ సమతుల్యతను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ యజ్ఞంలా మొక్కలు నాటాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. హరితహారంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో  శనివారం మొక్కల పంపిణీ చేపట్టారు. హరితహారంలో భాగంగా నగరంలోని జ్యోతినగర్ (కూర్మవాడ చౌరస్తా) ప్రాంతంలో హారితహారంలో భాగంగా మొక్కల పంపిణీ చేపట్టారు.45 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గందే మాధవి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాలనీవాసులు, విద్యార్థినీ, విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ సమతుల్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని అన్నారు. చిన్నారులు మొక్కలు నాటుతూ… ప్రతి రోజు స్కూల్ కు వెళ్లేముందు నీరందించాలని సూచించారు. మొక్కలు నాటాలని…నాటిన మొక్కలను సంరక్షిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగరమంతా వనంగా మారాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలన్నారు. వానదేవుడు కరుణించాడని, బ్రహ్మండంగా కురుస్తున్న వర్షాలకు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. భావితరాలకు చెట్లను ఆస్తిగా అందించాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దేవారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వాలా రమణారావు, సదానంద చారీ, కర్రె పావని, సిఓ పద్మ, మంజుల, బీర్ల కవిత, హరిత, దుర్గ, లత, భాగ్య, మమత , శోభా, రేణుక, రజని, రఘు, శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, కమలాకర్, తిరుపతి, శ్రీను, భార్గవి, వినోద, అపర్ణ, మరియు డివిజన్ ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *