సూది ఇచ్చిన ఎమ్మెల్యే గంగుల
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 5: పశువులు ఆరోగ్యం గా ఉంటే పాల దిగుబడి పెరుగుతుంది. పల్లెల్లో రైతులు సంతోషంగా ఉండాలి అంటూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షిించారు. శుక్రవారం కరీంనగర్ మండలంలోని దుర్షేడ్ గ్రామంలో ఎమ్మెల్యే కమలాకర్ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో 8635 పశువులు ఉన్నాయని, జులై 22 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రైతులంతా వినియోగించుకోవాలని కోరారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని, ఎఫ్ఎండి టికాలను విధిగా చేయించుకోవాలని, పశు జాతిని పెంపొందించుకోవాలని సూచించారు. సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నామని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. రైతు ఆత్మహత్యలను నిరోధించాలని, రైతు మొఖంలో ఆనందాన్ని చూడలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, ,సర్పంచ్ గాజుల వెంకటమ్మ , ఎంపీటీసీ గోలే రాజ్యలక్ష్మీ , జెడి రాజన్న , వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, కో ఆప్షన్ సభ్యులు సర్వర్, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, బుర్ర తిరుపతి గౌడ్ ,మడికంటి మారుతి , జక్కం నర్సయ్య ,ఆనందరావు , జువ్వాడి రాజేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు