మంత్రిగా గంగుల కమలాకర్….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 8: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అవకాశం లభించింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి కమలాకర్ కు పిలుపురావడంతో రాజ్ భవన్ కు తరలివెళ్లారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ గా నిలిచారు. ఎప్పటి నుంచో కమలాకర్ కు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. అందరు ఊహించినట్లుగానే కమలాకర్ కు లభించింది. దీంతో కరీంనగర్ లో ఆయన అభిమానులు, కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న కమలాకర్ కు (జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్) వెబ్ న్యూస్ పక్షాన ఆ న్యూస్ ఎడిటర్ జానంపేట మారుతీ స్వామి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.