కొబ్బరి కాయ కొట్టిన ఎమ్మెల్యే
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 8: జర్నలిస్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం స్థానిక ఉజ్వల పార్క్ సమీపంలోని జర్నలిస్టుల కాలని అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (డిఎంఎఫ్ డీ) నిధుల నుండి రూ.1కోటి కేటాయించడం జరిగిందని అన్నారు. మొదటి విడతగా రూ.50 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన జర్నలిస్టులను ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.