JMS News Today

For Complete News

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 9: కరీంనగరంలోని రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
రూ.14.50 కోట్లతో చేపట్టనున్న అంబేడ్కర్ స్టేడియం నుండి గణేష్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా కాలనీవాసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను శాలువాతో సత్కరించారు. రోడ్లన్నీ కాలినడకన తిరుగుతూ ఎమ్మెల్యే పరిశీలించారు. పురాతన ప్రధాన రహదారి కలెక్టర్ ఆఫీస్ పక్క నుండి అంబేద్కర్ స్టేడియం, హనుమాన్ నగర్ మీదుగా గణేష్ నగర్ వరకూ ఉన్న రహాదారిని అద్బుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి నిధుల ద్వారా మొదటి విడతలో మూడున్నర కోట్లు, రెండవ విడతలో 11 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పారు. డ్రైయిన్ కూలిపోయినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఎడమ వైపు ఇప్పటికే డ్రైనేజీ నిర్మించామని, హైదరాబాద్ మేన్ రోడ్ నుండి ఎండీవో ఆఫీస్ వరకూ పనులు ప్రారంభించామని చెప్పారు. రెండు నెలల్లో రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు. రోడ్డు పూర్తయితే హైదరాబాద్ ప్రయాణించే వారికి ఈ రోడ్డు ఉపయోగపడునుందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నలువాల రవీందర్, బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, నాయకులు కాశెట్టి శ్రీనివాస్, చల్లా హరిశంకర్, జంగిలి సాగర్, పైడిపల్లి రాజు, పొన్నం రాజు, మున్సిపల్ ఎస్ఈ భద్రయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ చిన్నారావు, డిఈ యాదగిరి, ఏఇ వాణి, పలువురు నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.