ఎన్నడు లేనంతగా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 4: నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని 11, 39 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కమలాకర్ శంకుస్థాపన చేశారు.11వ డివిజన్ లో ముఖ్యమంత్రి మూడవ విడత 100 కోట్ల హామీ నిధులు 48.5 లక్షల తో సీసీ రోడ్డు స్లాబ్ , కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ నగర పాలక సంస్థకు ముఖ్యమంత్రి హామీ నిధులు అత్యధికంగా మంజూరు అయ్యాయని అన్నారు. పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పట్టణాన్ని సర్వాంగసుందరంగా చేపట్టి తెలంగాణలో ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రోడ్ల విస్తరణకు నగర ప్రజలంతా సహకరించాలని, 100 కోట్ల నిధుల లో అన్ని శాఖల బాగస్వామ్యం ఉన్నందున అధికారులంతా సమన్వయంతో నగర అభివృద్ధికి కృషి చేయాలని సూూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు , మాజీ కార్పొరేటర్లు పిట్టల శ్రీనివాస్ మాజిద్ హుస్సేన్ సునీల్ రావు, నేేేేతలు చల్లా హరి శంకర్, ప్రేమ్ కుమార్ ముందడా తదితరులు పాల్గొన్నారు