JMS News Today

For Complete News

కొబ్బరి కాయ కొట్టిన ఎమ్మెల్యే

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 4: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ కల్వర్టు పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్  ఆదివారం శంకుస్థాపన చేశారు. చుక్క వర్షం పడితే నానా అవస్థలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో డ్రైనేజీ పనులు మొదలుకావడంతో నగరంలోని అశోక్ నగర్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆటంకాలకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి తమను ముంపు కష్టాల నుంచి బయటపడేయాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే నానా ఇబ్బందులు పెట్టే, అశోక్ నగర్ నాలా పనులు  మొదలయ్యాయి. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో ఇక పనులను వేగవంతం చేయనున్నారు. అశోక్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న ఇంటి దగ్గరి నుంచి, పాత రింగ్ రోడ్డు వరకు ఉన్న డ్రైనేజీ మొత్తాన్ని సుమారు ₹ 1 కోటీ యాభై లక్షలతో ఆధునీకరించనున్నారు. గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా అశోక్ నగర్ కు వచ్చారు. ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. స్థానికులతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొబ్బరికాయ కొట్టి డ్రైనేజీ మరమ్మత్తు, కొత్త కల్వర్టు ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఇవ్వాళ్టి నుంచే పనులు మొదలుపెట్టి, వీలైనంత త్వరగా ముగించాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాాయకులు గగ్గిలపు రమేష్, సునీల్ రావు, హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *