మున్సిపల్ మాదే….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూన్ 28: తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వ నమోదు చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కు సభ్యత్వం అందించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని తెలిపారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించామని అన్నారు. 29వ తేదీన కరీంనగర్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సమావేశం నిర్వహించి తదుపరి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు గత కొన్ని నెలులుగా పెండింగ్ లో ఉన్నాయని, ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో అన్నింటినీ మొదలు పెడతామని అన్నారు. ప్రధాన రోడ్ల నిర్మాణాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ గౌడ్ , జెడ్ పి టిసి పిట్టల కరుణ రవీందర్ కార్పొరేటర్లు బండారి వేణు, పెద్దపల్లి రవీందర్ , కర్రె లింగయ్య కంసాల శ్రీనివాస్ , అజిత్ రావు కోడూరి రవీందర్ గౌడ్,, పిట్టల శ్రీనివాస్ , జక్కని ఉమాపతి , తెరాస నాయకులు వాల రమణారావు, నేత కుంట యాదయ్య, సరిళ్ల ప్రసాద్, బోయినపల్లి శ్రీనివాస్, చల్లా హరీష్ శంకర్, గందె మహేశ్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎడ్ల అశోక్, గూడూరు మురళి , చిగిరి రవీందర్, తుల బాలయ్య , విద్యార్థి విభాగం నాయకులు పొన్నం అనిల్ గౌడ్ , సుడా డైరెక్టర్లు తోట మధు నేతి రవివర్మ ,షేక్ యూసఫ్ , తిరుపతి నాయక్, గణేష్ బాబు, రుద్రరాజు ఆనందరావు, కట్ట సత్తయ్య గౌడ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు..