ఎమ్మెల్యే పీఏ మృతదేహం లభ్యం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, నవంబర్ 4: జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిఏ గిరీష్ మృతదేహం లభ్యమైంది. తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం గల్లంతైన గిరీష్ సింగ్ మృతదేహం ఎట్టకేలకు సోమవారం రాత్రి లభ్యమైంది. సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లిన గిరీష్ కాల్వ ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. పంచాయితీ రాజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ ఉన్న గిరీష్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వద్ద పిఏగా కొనసాగుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరీష్ మృతదేహం లభ్యం కావడంతో అతని స్నేహితులు దుఖః సాగరంలో మునిగిపోయారు. మృతుడి నివసిస్తున్న కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.