ఎఐసిసి వద్ద రాజగోపాల్ జాతకం
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 3: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఏఐసీసీకి నివేదిక అందింది. మూడేళ్లలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనలు తెలుపుతూ సవివరమైన నివేదికను రాష్ట్ర నాయకత్వం సమర్పించింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో ఆధారాలను సేకరించారు. గడిచిన మూడేళ్లలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై ఆధారాలను సేకరించినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ నేతపై దాడి, భాజపాకు మద్దతుగా మాట్లాడటం, కాంగ్రెస్‌ను తక్కువ చేయడం, ప్రచార కమిటీ ఛైర్మన్‌పై, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిపై అనుచిత వ్యాఖ్యలు, షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీపై విమర్శలు చేయడం వంటి వివరాలతో నివేదిక రూపొందించారు. ఎఐసిసి ఏమి చేయబోతోంది అనేది చూడాలి మరీ.