ఆ ఎమ్మెల్యే కు ఊరట…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 10: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సరిగా లేవని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఉన్నత న్యాయస్థానంలో బుధవారం విచారణ జరిగింది. దీనిపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను మళ్లీ పరిశీలించాలని సూచించింది. ఈ అంశంపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెన్నమనేని అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తాజా అభిప్రాయంతో రమేష్ కు ఊరట లభించినట్లయింది.