ఆయన యువతకు స్ఫూర్తి….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, జనవరి 12: యువ శక్తి అనునది అణు శక్తి కంటే బలమైనదని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు దేశ విదేశాలలో చాటిచెపి యువతలో ఆత్మ విశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పంపై రచనలు ప్రసంగాలతో చైతన్య వంతులను చేసినా యువజన స్ఫూర్తి ప్రదాత యువ శక్తికి ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడని, అతని అడుగుజాడల్లో యువత పయనించాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు .ఆదివారం రామడుగు మండలం వెదిరే ఎక్స్ రోడ్డు వద్ద స్వామి వివేకానంద 157 వ జయంతి కార్యక్రమం జాతీయ యువజన అవార్డు గ్రహీత అల్వాల విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వివేకానంద జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని శాసనసభలో కూడా మాట్లాడతానని అన్నారు స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం “”ఫిట్ ఇండియా _ఫిట్ యూత్””అనే నినాదంతో వెదిరె గ్రామ కూడలి నుండి వివేకానంద విగ్రహం వరకు కాలినడకన విద్యార్థి యువత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని యూనిసెఫ్ జిల్లా అధికారి కిషన్ స్వామి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నడకను అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. వివేకానంద జన్మదినం పురస్కరించుకొని ట్రైనీ ఎస్సైగా ఎంపికైన వెదిరె గ్రామానికి చెందిన హరిప్రియను గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల సంగీత రాజశేఖర్, ఎంపీపీ కలిగేట్ కవిత లక్ష్మణ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు శుక్ర దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, ఎంపిటిసి అనిల్ కుమార్, ఉప సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత అల్వాల విష్ణు, రేండ్ల కళింగ శేఖర్, నాయకులు మార్ కొండ కృష్ణారెడ్డి, తవుట్టు మురళి, వీర్ల నర్సింగరావు, ఎలకపల్లి లచ్చయ్య, జితేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్,
యువజన సంఘాల సమితి నాయకులు గజ్జల అశోక్, అంబటి వినోద్, అశోక్ రెడ్డి, కొలిపాక కమలాకర్, శ్రీరామోజు సాయికుమార్, మహేందర్ రెడ్డి, కొలిపాక నాగరాజు, అర్జున్ ప్రసాద్, ప్రవీణ్, నవీన్, వినయ్, అక్షరస్కూల్, చైతన్య స్కూలు , మోడల్ స్కూలు విద్యార్థులు పలు గ్రామల యువత తదితరులు పాల్గొన్నారు