JMS News Today

For Complete News

ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జనవరి 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖ రాశారు. పాల్వంచ ఘటన తీవ్ర క్షోభకు గురిచేసిందన్నారు. తన కుమారుడిపై రామకృష్ణ ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. రాఘవను పోలీస్‌ విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే స్పందించిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రాఘవను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రాఘవను పోలీసులు కొత్తగూడెం తరలించినట్లు తెలుస్తోంది. రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.