ఉచిత విద్యుత్ సరఫరా చేయండి..
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, ఆగస్టు 28: హిందువులు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించే గణేష్ నవరాత్రుల కోసం ఏర్పాటు చేసుకునే మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని పట్టబద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుధవారం జీవన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని మతాలకు సంబంధించిన పండుగలకు అవసరమగూ సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న మాదిరిగానే హిందువులు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసే మండపాలకు కూూడా విద్యుత్ సౌకర్యం ఉచితంగా కల్పించాలని జీవన్ రెడ్డి సూచించారు. హిందూ సమాజం గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపాలకు విద్యుధ్ధీపాల అలంకరణ నిర్వహాకులకు ఆర్థికభారం పడుతున్న నేేేపథ్యంలో ప్రభుత్వం ఇతర మతాలకు కల్పిస్తున్న రాయితీల మాదిరిగానే గణేష్ ఉత్సవాలకు కావలసిన విద్యుత్ సరఫరా చేేేయాలని సీఎం కు రాసిన లేేేఖలో జీవన్ రెడ్డి కోరారు. కేసీఆర్ తో పాటు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ గౌరవ అధ్యక్షులు, విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సిఎం డీ దేవులపల్లి ప్రభాకర్ రావు లకు జీవన్ రెడ్డి లేఖ రాశారు.