మళ్లీ అదే కథ….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, సెప్టెంబర్ 3: ఎస్సారెస్పీ నీటిని గతంలో లోయర్ మానేరు డ్యాంకు అక్రమంగా తరలించారో అదే కథ మళ్ళీ పునరావృతం అవుతుందని పట్టబద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని లక్ష్మీ పూర్ పంప్‌హౌస్ నుండి మిడ్ మానేర్, ఎల్ఎండి తోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జగిత్యాల జిల్లా రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తున్నారని, ఇది ఇలాగే జరిగితే రైతుల నుంచి ఆందోళన ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ఎస్సారెస్పీలో ఏ మేరకు నీరు చేరుతుందో అధికారుల్లో అంచనాలు, స్పష్టత లేదని, ప్రస్తుతం 24టిఎంసీలుండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మూలంగా 50 టిఎంసీలకు70 టిఎంసీల నీరుంటేనే ఖరీఫ్ పంటకు సరిపోతుందనీ, రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ నీ నింపాలని అన్నారు. ఖరీఫ్ రుణ ప్రణాళిక నిర్దిష్టంగా లేదని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాకర్స్, వ్యవసాయ శాఖ తోపాటు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించలేదని, రుణమాఫీ పై ప్రభుత్వం వద్ద స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. పంట విస్థీర్ణం, సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని, జిల్లా పాలన యంత్రాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖల మద్య సమన్వయం లోపించిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లాకు ఖరీఫ్ పంటకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ఇప్పటికీ కేవలం13వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగిందనీ, దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రోడ్డెక్కుతున్నారనీ, తక్షణమే10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కి తేవాలని సూచించారు. రైతులకు పంట రుణాల కల్పన, విత్తన, ఎరువుల సరఫరా, మార్కెట్ సదుపాయాలు కల్పన కోసం రైతులకు అండగా ఉంటాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు ఎక్కడ కనిపించడం లేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అధికారముందని ఇష్టమొచ్చినట్లు వ్యవహారిస్తే ప్రజాగ్రహానికీ గురికాకతప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో టిపిసీసి కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్, టౌన్ కాంగ్రెసు అధ్యక్షుడు కొత్త మోహన్, గుంటి జగదీశ్వర్, మన్సూర్, గంగం మహేష్, మొగిలి, చెవుల గంగయ్య , మునీందర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.