ఆమె ఓటమికి వారే కారణం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, జూలై 27 : సీనియర్ కాంగ్రెస్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాలలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచుంటే అంతో ఇంతో అభివృద్ధి జరిగేది..టీఆర్ఎస్ నేతలకు తెలివి లేదు. తెలివి ఉంటే కవితను ఓడిస్తారా ?. టీఆర్ఎస్లో గ్రూపుల కుమ్ములాటలు కవితను ఓడించాయి. ఆమెకు అన్యాయం చేసింది ఆ పార్టీ నేతలే అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పంద్రాగష్టు లోపు పథకాల అమలు మీద స్పష్టత ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.