JMS News Today

For Complete News

సంగారెడ్డి జిల్లాలో దారుణం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

సంగారెడ్డి, జూలై 11: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తల్లీ, కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లాలోని నాగల్ గిద్ద మండలం కాసర్ గుత్తి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. కాసర్ గుత్తి కి చెందిన సుజాత (31), ఆమె కొడుకు దినేష్ (4)లను గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. సుజాత భర్త ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లి, కొడుకు హత్య స్థానికంగా విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *