JMS News Today

For Complete News

పండుగ పూట తీవ్ర విషాదం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

గంభీరావుపేట, మార్చి 18: పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి తను ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలు అభిగ్న, అన్షిక మృతదేహాలు లభించగా, తల్లి రేణుక మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *